విజయ్‌మాల్యా కేసులో సుప్రీం తీర్పు రిజర్వు

కోర్టు ధిక్కరణ కేసులో తనను దోషిగా పేర్కొంటూ 2017లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని రుణాల ఎగవేతదారు విజయ్‌ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వు చేసింది.

Published : 28 Aug 2020 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోర్టు ధిక్కరణ కేసులో తనను దోషిగా పేర్కొంటూ 2017లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని రుణాల ఎగవేతదారు విజయ్‌ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వు చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 40 మిలియన్‌ డాలర్ల సొమ్మును తన వారసులకు బదిలీ చేయడంపై విజయ్‌ మాల్యాను సుప్రీం కోర్టు 2017లో దోషిగా తేల్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ మాల్యా వేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ చేపట్టింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ మాల్యా.. అతడి కుమారుడు, కుమార్తెలకు 40 మిలియన్‌ డాలర్లను బదిలీ చేశారంటూ ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకు కన్సార్షియం సుప్రీంలో పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం విజయ్‌ మాల్యాను కోర్టు ధిక్కరణ కింద దోషిగా తేలుస్తూ 2017 మేలో తీర్పు వెలువరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని