Supreme Court: వరవరరావుకు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

భీమా కోరెగావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 10 Aug 2022 12:51 IST

దిల్లీ: భీమా కోరెగావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్‌ మంజూరు చేసినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అయితే.. గ్రేటర్‌ ముంబయి దాటి ఎక్కడికి వెళ్లకూడదని నిబంధన విధించింది. ఈ మేరకు వరవరరావుకు నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పుణె జిల్లాలోని భీమా కోరెగావ్‌లో 2018 జనవరి 1న జరిగిన హింసతో పాటు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావు సహా ఐదుగురిని 2018లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని