Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తును ఎందుకు పూర్తి చేయడం లేదని ధర్మాసనం సీబీఐని ప్రశ్నించింది.

Updated : 20 Mar 2023 17:59 IST

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య కేసు దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను విచారణాధికారి బాధ్యతల నుంచి తప్పించి, మరో అధికారిని నియమించాలని కోరుతూ నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

హత్య కేసు దర్యాప్తును ఎందుకు పూర్తి చేయడం లేదని.. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారిని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు విచారణ త్వరగా ముగించకుంటే మరో అధికారిని ఎందుకు నియమించకూడదని కోర్టు ప్రశ్నించింది. వేరొకరిని నియమించడంపై సీబీఐ డైరెక్టర్‌ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ వాదనలు వినిపిస్తూ..  దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో పురోగతి ఉందని.. దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు