సివిల్ జడ్జి పరీక్ష అర్హతపై సుప్రీం విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ జడ్జి పరీక్ష అర్హతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సివిల్ జడ్జి పరీక్ష అర్హతకు మూడేళ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలన్న నిబంధనను సవాలు చేస్తూ వెంకటేశ్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నిబంధనను రద్దు చేసేలా..

Published : 05 Jan 2021 16:39 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ జడ్జి పరీక్ష అర్హతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సివిల్ జడ్జి పరీక్ష అర్హతకు మూడేళ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలన్న నిబంధనను సవాలు చేస్తూ వెంకటేశ్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నిబంధనను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు పిటిషన్‌పై జస్టిస్‌ సంజయ్‌ కిషన్ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ తరఫున న్యాయవాది పునీత్‌ జైన్‌ వాదనలు వినిపించారు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే మరోవైపు మూడేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంటూ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇంప్లీడ్ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్‌ దాఖలు చేసేందుకు 3 వారాల గడువు ఇచ్చింది. మరోవైపు సివిల్ జడ్జి పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్‌ ధర్మాసనాన్ని కోరారు. దరఖాస్తు గడువు ముగిసినందున ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం తెలిపింది వెల్లడించింది.

ఇవీ చదవండి..

ఏపీలో కొత్త కోర్సులకు రూపకల్పన

పారదర్శకతను ఓ స్థాయికి తీసుకెళ్లాం: జగన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని