Mental Health: మన శక్తిని హరిస్తున్న ఆశ్చర్యకర విషయాలేవో తెలుసా?
మనిషి వేటివల్ల అంత త్వరగా శక్తిని కోల్పోతున్నారు? తీవ్ర ఒత్తిడికి గురయ్యి మానసిక ప్రశాంతత కోల్పోవడానికి గల కారణాలేంటి?
ఆఫీసులో త్వరగా పని పూర్తి చేసి బాస్‌తో శెభాష్ అనిపించుకోవాలని ప్రతి ఉద్యోగి రోజును ప్రారంభిస్తారు. కానీ, ఆఫీసుకెళ్లి పని మొదలుపెట్టగానే ఉన్నట్టుండి నిస్సత్తువ ఆవహించి చేసే పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. శారీరకంగా దృఢంగా ఉన్నా మానసికంగా కుంగిపోతున్నారు. అసలు వేటివల్ల అంత త్వరగా శక్తిని కోల్పోతున్నారు? తీవ్ర ఒత్తిడికి గురై మానసిక ప్రశాంతత కోల్పోవడానికి గల కారణాలేంటి? తిరిగి శక్తిని ఎలా సంపాదించుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందామా..
చివరగా తాగిన కాఫీ..
మనం నిద్రించే సమయానికి ముందు తాగే కాఫీ నిద్రపైనా తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. తత్ఫలితంగా మన ఎనర్జీ లెవల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పడుకునే ముందు టీ, కాఫీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
వ్యాయామం వదిలేసినా..
అందరూ వ్యాయామం చేస్తే ఎనర్జీ పోయి త్వరగా అలసిపోతారని అనుకుంటారు. కానీ, వ్యాయామం చేయకపోతేనే శరీరం బద్ధకంగా తయారై అలసిపోయినట్లు అనిపిస్తుందట. వాస్తవానికి వ్యాయామం 60 శాతం శరీర అలసటను తగ్గిస్తుందని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేసినవారు రోజంతా చాలా యాక్టివ్‌గా ఉండి తమ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారని తెలిపారు.
డీహైడ్రేషన్..
మనిషి శరీరానికి నీరు చాలా అవసరమని పలు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని సూచిస్తున్నాయి. నీరు తగినంతగా తీసుకోకపోతే డీహైడ్రేషన్‌కు గురవ్వడం, శరీర అవయవాల పనితీరు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. డీహైడ్రేషన్‌కు గురైన వారిలో చర్మం, కళ్లు పొడిబారిపోతాయి. చిరాగ్గా అనిపిస్తుంది. కేవలం వేసవి కాలంలో మాత్రమే శరీరం డీ హైడ్రేషన్‌కు గురవ్వాలని ఏమీ లేదు. శరీరంలో నీటిస్థాయిలు తగ్గినప్పుడు ఎప్పుడైనా ఈ సమస్య తలెత్తవచ్చు.
మల్టీటాస్కింగ్..
ఒకేసారి మనం రెండు మూడు పనులు చేసి రిలాక్స్ అవుదామని భావిస్తాం. కానీ, దీనివల్ల తొందరగా శక్తిని కోల్పోతాం. కంపెనీ అవసరాలకు అనుగుణంగా కొన్నిసార్లు ఒకటికి మించి పనులు చేయాల్సి వస్తోంది. దీనివల్ల మెదడు చాలా శక్తిని కోల్పోతుంది. దీంతో మానసికంగా అలసిపోతాం. ఇటువంటి పనులను ఒకేసారి కాకుండా విభజించి చేసుకోవాలి. మధ్యమధ్యలో బ్రేక్ తప్పనిసరిగా తీసుకోవాలి. అదేపనిగా చేస్తూ పోతే చేసే పనిమీద దృష్టి కేంద్రీకరించడం సాధ్యం కాదు.
బెడ్ మీద మొబైల్ పట్టుకొని..
ఈ కాలంలో మొబైల్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఫోన్ చేతిలో లేకపోతే కొందరికి ఏదో కోల్పోయామనే భావన కలుగుతుంది. మొబైల్ ఫోన్ కూడా ఒకరకంగా మానసిక ఒత్తిడికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు మొబైల్ అతిగా వాడటం వల్ల దీనిలోని నీలికాంతి వల్ల ఆరోగ్యానికి చేటు కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి రాత్రుళ్లు పడుకునే ముందు ఫోన్ జోలికి పోకుండా ఉండడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
నోరు తెరిచి నిద్రపోతే..
మనం ఒకసారి నిద్రలోకి జారుకున్నాక అసలు ప్రపంచాన్నే మరిచిపోతాం. కొందరు నిద్రలో గురక పెడుతుంటారు. అయినా ఒకరు చెబితే కానీ, అది వారికి తెలియదు. ఇంకొందరు వారికి తెలియకుండానే నోరు తెరిచి నిద్రిస్తుంటారు. దీనివల్ల వారి శరీరం డీహైడ్రేషన్‌కు లోనయ్యే అవకాశాలుంటాయి. ఇది రోజువారీ ఎనర్జీ లెవల్స్ మీద ప్రభావం చూపుతుంది. నిద్రలో గురక పెట్టే వారు కొన్ని బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ చేయడం మంచిది.
కూర్చొనే విధానం ఎలా ఉంది?
మన ఎనర్జీ లెవల్స్ తగ్గిపోయి.. శరీరం త్వరగా అలసిపోవడానికి మన కూర్చొని పనిచేసే విధానం కూడా ఆధారపడి ఉంటుంది. సరైన పద్ధతిలో కూర్చొకుండా పనిచేయడం వల్ల కీళ్లు, కండరాలపై భారం పడుతుంది. తలవాల్చడం, సిస్టమ్‌ను దగ్గరగా చూడడం, కుర్చీలో సరిగా కూర్చోకపోవడం వల్ల త్వరగా ఎనర్జీ కోల్పోయే అవకాశం ఉందట. కావున కూర్చొని పనిచేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కూర్చొని విధానంలో నడుంపై భారం పడకుండా కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు. మధ్యమధ్యలో విరామం తీసుకోవాలని.. కొన్ని నిమిషాలపాటు మధ్యమధ్యలో నడిస్తే ఇంకా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఆల్కహాల్ మంచిదేనా..!
చాలా మంది రోజూ పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకుంటే గాఢ నిద్రలోకి జారుకుంటామని భావిస్తారు. కానీ, ఆల్కహాల్ నిద్రను భంగం చేస్తోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీలైనంత వరకు ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నాయి.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మనిషి ప్రశాంతంగా ఉండటానికి కాసేపు యోగా చేయాలని నిపుణులు పదేపదే సూచిస్తున్న విషయం తెలిసిందే. రోజూ కనీసం అరగంట సేపు యోగా చేస్తే ఒత్తిడిని దూరం చేసే హార్మోన్లు రిలీజ్ అయ్యి మానసికంగా దృఢంగా తయారవుతారు. మానసిక ఉల్లాసానికి, ఏకాగ్రతని పెంచడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
నారా లోకేశ్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Seethakka: నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు: హైకోర్టులో సీతక్క పిటిషన్
-
Mahabubabad: జిల్లా కోర్టు సంచలన తీర్పు.. బాలుడి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
-
Peddha Kapu-1 Movie Review: రివ్యూ: పెదకాపు.. విరాట్, శ్రీకాంత్ అడ్డాల మూవీ మెప్పించిందా?
-
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
-
Vishal: సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు.. స్పందించిన కేంద్రం