
ABV: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
అమరావతి: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసులోకి తిరిగి తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసు రీఇన్‌స్టేట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జీఏడీకి రిపోర్టు చేయాలని సూచించింది.
సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఏబీవీని ఏపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న విధుల్లోంచి తొలగించింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై వేటు వేసిన విషయం తెలిసిందే.
ఏబీవీకి గత నెల సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనపై సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దాంతో ఆయన సస్పెన్షన్ రద్దయింది. ఏబీవీ సస్పెన్షన్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 7తో ముగిసినందున ఇకపై సస్పెన్షన్ చెల్లదని స్పష్టం చేస్తూ పిటిషన్ విచారణను ముగించింది.
ప్రతివాది(ఏబీవీ) ఫిబ్రవరి 8వ తేదీ నుంచి సర్వీసులో ఉన్నట్లు గుర్తించి ఆయనకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Yanamala: దోచుకున్న ప్రతి రూపాయీ ప్రజలు కక్కిస్తారు: యనమల
-
Business News
Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
-
India News
LPG price: వంటగ్యాస్ మంట.. ఏడాదిలో రూ.244 పెంపు
-
Movies News
Chiranjeevi: చిరు పేరు మార్పు.. న్యూమరాలజీనా? లేదా టీమ్ తప్పిదమా?
-
Sports News
Aravinda de Silva : క్రికెట్ వృద్ధి కోసం.. టీ20 లీగ్‌లపై భారత్ పట్టు సడలించాలి: లంక మాజీ క్రికెటర్
-
Crime News
Andhra News: మైనర్ల డ్రైవింగ్.. తెనాలిలో కారు బీభత్సం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు