Potato Milk: ఏవండోయ్‌.. ‘ఆలూ పాలు’ గురించి విన్నారా?

మీకు తెలిసిన పాల గురించి చెప్పండి అంటే.. గుక్కతిప్పుకోకుండా ఆవు పాలు, గేదె పాలు, సోయా మిల్క్‌, ఆల్మండ్ మిల్క్‌, ఓట్ మిల్క్ అని చెప్పేస్తారు. అవీ కాకుండా ఇంకొన్ని చెప్పడంటే... మేకపాలు, గాడిదపాలు, ఒంటె పాలు అని చెప్తారు.

Published : 13 Feb 2022 01:13 IST

(credits: Kirsty Bosley twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: మీకు తెలిసిన పాల గురించి చెప్పండి అంటే.. గుక్కతిప్పుకోకుండా ఆవు పాలు, గేదె పాలు, సోయా మిల్క్‌, ఆల్మండ్ మిల్క్‌, ఓట్ మిల్క్ అని చెప్పేస్తాం. అవీ కాకుండా ఇంకొన్ని చెప్పడంటే... మేకపాలు, గాడిదపాలు, ఒంటె పాలు అని చెప్తాం.. తాజాగా ఆ లిస్ట్‌లో మరో పేరు చేరింది. అదే.. ‘ఆలూ మిల్క్‌’. అవును..! ఇప్పుడు ఆలూ పాలు అందుబాటులోకి వచ్చాయి. స్వీడ‌న్‌కు చెందిన డ‌గ్ (DUG)  కంపెనీ వీటిని బ్రిటన్‌లో ప్రవేశపెట్టింది. అందుబాటు ధరలో ఉన్న వీటిలో పోషకవిలువలూ ఎక్కువే. వివిధ విట‌మిన్స్‌ శరీరానికి అందటంతో పాటు రుచిక‌రంగా ఉంటాయట. సాధార‌ణంగా ఆవులు, గేదెలు వంటి జంతువుల నుంచి ల‌భించే పాలల్లో లాక్టోజ్ ఉంటుంది. అయితే ఈ బంగాళాదుంప పాలలో లాక్టోజ్ ఉండకపోవడం గమనార్హం. అందుకే శాకాహారులు దీన్ని విపరీతంగా ఇష్టపడుతున్నారట. ఇక ఈ పాల ధర లీట‌ర్ రూ. 170 ఉండటంతో పెద్ద మొత్తంలో వ్యాపారానికి గీరాకి అవుతోంది.  సోయా పాల‌లో ల‌భించే ప్రోటీన్ల క‌న్నా ఇందులో నాలుగు రెట్లు అధికంగా ఉంటాయట.

  • జంతువుల నుంచి సేకరించే పాలలాగానే ఆలూ పాలు కూడా చిక్కగా, రుచికరంగా ఉంటాయన్నది విశ్లేషకుల మాట.
  • ప్రస్తుతం బ్రిటన్‌లో అందుబాటులో ఉన్న ఈ పాలు.. త్వరలోనే ఐరోపాతో పాటు, అమెరికా, చైనాలోనూ ప్రారంభించాలని డగ్‌ కంపెనీ యోచిస్తోంది.
  • ఈ పాలతో మనం కాఫీ లాగానే కాపిచీనో కూడా తయారు చేసుకోవచ్చని ఆహార ప్రియులు చెబుతున్నారు.
  • మాల్టోడెక్స్‌ట్రిన్, పీ ప్రొటీన్, చికోరీ ఫైబర్, ర్యాప్‌సీడ్‌ ఆయిల్, ఫ్రక్టొస్, సుక్రోజ్‌ సహా వివిధ పోషకాలతో కూడిన ఆలూ పాలను కొనేందుకు ప్రస్తుతం యూకేవాసులు పోటీపడుతున్నారట.
  • ఇది వెగాన్‌ ఫ్రెండ్లీ (అంటే జంతురహిత ఉత్పత్తి) కావడంతో వీగన్లు కూడా ఈ ఆలూ పాలు కొంటున్నారు.
  • జంతువులు ఇచ్చే పాలలో ఉండే లాక్టోజ్‌ (ఒక రకమైన చక్కెర) కొందరికి జీర్ణం కాదు. కానీ ‘డగ్‌’ తయారు చేసే ఆలూ పాలు లాక్టోజ్‌రహితమైనవట. అందుకే ఆలూ పాలకి డిమాండ్‌ పెరిగింది.
  • ఆల్మండ్‌ మిల్క్, సోయా మిల్క్‌ కంటే తక్కువ ధర కావటంతో ఎక్కువగా అమ్ముడుబోతున్నాయని వినియోగదారులు అంటున్నారు.
  • వ్యాపార స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు వీలుండటంతో ఆలూ నుంచి పాల తయారీని లాభదాయక వ్యాపారంగా చేసుకున్నామని ‘డగ్‌’ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
  • తక్కువ నీటి వాడకంతోనే ఆలూ పంట చేతికొచ్చే అవకాశం ఉండటం కూడా ఇందుకు మరో కారణమని కంపెనీ చెబుతోంది. 
Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts