Ktr: హైదరాబాద్‌కు స్విస్‌ రే.. స్వాగతమంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్‌

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత బీమా సేవల సంస్థ స్విస్‌ రే హైదరాబాద్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో

Published : 23 May 2022 16:53 IST

హైదరాబాద్: స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత బీమా సేవల సంస్థ స్విస్‌ రే హైదరాబాద్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో భాగంగా కంపెనీ ఈ మేరకు ప్రకటన చేసింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో స్విస్ రే కంపెనీ ఎండీ వెరోనికా, ప్రతినిధులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బీమా రంగంలోకి స్విస్ రేకు స్వాగతమని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్విస్ రే కంపెనీ ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందని కేటీఆర్ చెప్పారు. 250 మంది ఉద్యోగులతో ప్రారంభమయ్యే హైదరాబాద్ యూనిట్‌లో డేటా, డిజిటల్ కేపబిలిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని