
KTR: తెలంగాణలో ఫెర్రింగ్ ఫార్మా సంస్థ కార్యకలాపాల విస్తరణ.. రూ.500 కోట్ల పెట్టుబడి
దావోస్: స్విట్జర్లాండ్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించనుంది. సుమారు రూ.500 కోట్లతో విస్తరణ ప్రణాళికలను కంపెనీ ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో ఫెర్రింగ్ ఫార్మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలెస్ఆండ్రో గిలియో, ప్రతినిధి బృందం సమావేశమైంది. భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు వారు ప్రకటించారు. క్రోన్, అల్సారేటివ్ కోలైటిస్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే తన ట్రేడ్ మార్క్ పెంటసాను ఉత్పత్తి చేసేందుకు నూతన ప్లాంట్‌ను వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే అతి పెద్ద మేసాలజైన్, ఏపీఐ తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఫెర్రింగ్ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల నుంచి తన ఉత్పత్తులను తయారు చేస్తుంది. వీటికి అదనంగా హైదరాబాద్ నగరంలో తన ఫార్ములేషన్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఫెర్రింగ్ కంపెనీ తెలిపింది.
ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాద్‌లో తన విస్తరణ ప్రణాళికలు ప్రకటించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేవలం నెల రోజుల క్రితమే కంపెనీ యూనిట్‌ను హైదరాబాద్ లో ప్రారంభించానని, ఇంత త్వరగా కంపెనీ అదనంగా మరో రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టడం తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలకు నిదర్శనమన్నారు. కేవలం దేశీయ కంపెనీలకే కాకుండా అంతర్జాతీయ విదేశీ కంపెనీలకు సైతం తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉందనే విషయాన్ని ఈ పెట్టుబడి ప్రకటన నిరూపిస్తోందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాపార, వాణిజ్య, ఉపాధి కల్పన అనుకూల కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణలో విస్తరణకు పెట్టుబడి పెడుతున్న ఫెర్రింగ్ ఫార్మా కంపెనీకి ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra: శిందే గూటికి 14 మంది శివసేన ఎంపీలు..?
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్ నగరాలపై రష్యా మళ్లీ క్షిపణుల వర్షం!
-
Movies News
Johnny Depp: డిస్నీ వరల్డ్‌లోకి జానీ డెప్.. రూ.2,535 కోట్ల ఆఫర్ నిజమేనా?
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం: పంజాబ్ సీఎం
-
Movies News
Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
-
Sports News
Chandrakant Pandit: మధ్యప్రదేశ్ కెప్టెన్ పెళ్లికి రెండు రోజులే సెలవిచ్చా: చంద్రకాంత్ పండిత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్‌ను కలిసిన ఫడణవీస్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
- Ire vs Ind: ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం.. సిరీస్ కైవసం
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Johnny Depp: డిస్నీ వరల్డ్‌లోకి జానీ డెప్.. రూ.2,535 కోట్ల ఆఫర్ నిజమేనా?
- Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం
- Social Look: రామ్‌చరణ్ ఇంట బాలీవుడ్ స్టార్ల సందడి.. పూజాహెగ్డే ‘వాటర్ బ్రేక్’!
- Rocketry: ఆ ఉద్దేశంతోనే ‘రాకెట్రీ’ తీశా.. వారంతా భారత్‌కు తిరిగిరావాలి: మాధవన్