Heart Health: చేపలతో గుండెకెంత మేలో తెలుసా..?

చేపలు రుచిగా ఉంటాయి..అవి తక్కువ ధరకు వస్తాయని తినడం కాదు..మీ గుండెకు ఆరోగ్యాన్నిచ్చేందుకు తినాలని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు. చేపల్లోని ఒమేగా-3 కొవ్వులు గుండెకు మిత్రులుగా చెబుతున్నారు. రక్తనాళాలను శుద్ధి చేస్తూ వాటిలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా చేయనున్నాయి. దీంతో గుండె జబ్బులు, గుండెపోటు ముప్పు తప్పనుంది.

Published : 18 Aug 2022 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చేపలు రుచిగా ఉంటాయి.. తక్కువ ధరకు వస్తాయని తినడం కాదు.. మీ గుండెకు ఆరోగ్యాన్నిచ్చేందుకు తినాలని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు. చేపల్లోని ఒమేగా-3 కొవ్వులు గుండెకు మిత్రులని చెబుతున్నారు. రక్తనాళాలను శుద్ధి చేస్తూ వాటిల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా ఇవి చేస్తాయి. దీంతో గుండె జబ్బులు, గుండెపోటు ముప్పు తప్పనుంది. చేపల్లో ఏవీ మంచివి..? ఎలా తినాలి..? వీటి గురించి సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ రమేశ్‌ గూడపాటి వివరించారు.

గుండె జబ్బులు తగ్గిపోతాయా..?

చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. వారానికి రెండు రోజులు తినొచ్చు. చేపల్లో ఎక్కువగా ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. గుండెకు చాలా మేలు చేస్తాయి. రక్తనాళాల్లో పూడికలను నివారించడం, రక్తం పలచ పడేందుకు తోడ్పడుతాయి. అధిక రక్తపోటు నివారణకు సహకరిస్తాయి. అన్ని రకాల చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఉంటుంది. కొన్నింటిలో ఎక్కువ, కొన్నింటిలో తక్కువగా ఉంటుంది. సముద్ర చేపల కంటే మంచినీటి చేపలు చాలా మేలు చేస్తాయి. కలుషిత నీరుండే ప్రాంతాల చేపలను తీసుకోకూడదు. వీటిలో మెర్క్యూరీ ఎక్కువగా ఉండటంతో మహిళలు, చిన్నారులకు హాని కలుగుతుంది. పెద్ద వాటి కంటే.. చిన్న చేపలు ఆహారంగా తీసుకుంటే మంచిది.

ఎలా తింటే మంచిది..!

చేపలను కూర వండుకొని తింటే చాలా మంచిది. నూనె ఎక్కువగా పోసి ఫ్రై చేసుకొని తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. పోషక విలువలు కూడా తగ్గిపోతాయి.

శాకాహారులకు ఒమేగా-3 కొవ్వు ఎలా..?

శాకాహారులకు కూడా ఒమేగా-3 కొవ్వు లభించే ఆహార పదార్థాలున్నాయి. సోయా, వాల్‌నట్స్‌, ఆకుకూరలు తిన్నా పోషకాలు వస్తాయి. కొవ్వు పదార్థాలు లభిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని