Telangana news: మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించేందుకు కృషి: తలసాని

పెరుగుతున్న మత్స్య సంపదకు అనుగుణంగా మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

Published : 04 Apr 2022 23:08 IST

హైదరాబాద్‌: పెరుగుతున్న మత్స్య సంపదకు అనుగుణంగా మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు మత్స్య సంపదను ఎగుమతి చేయడం, మత్స్యకారుల కుటుంబాల ఆదాయం పెంచటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో జిల్లా మత్స్య శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తలసాని ప్రారంభించారు. సభ్యత్వ నమోదు స్పెషల్  డ్రైవ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కొత్త సొసైటీలు ఏర్పాటు చేసే క్రమంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సహకార సంఘాల్లో సభ్యత్వ నమోదు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని