Stalin: అంబులెన్స్‌కు దారిచ్చిన స్టాలిన్‌.. ప్రజల ప్రశంసల వర్షం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు. చెన్నైలో తన కాన్వాయ్‌ వెళ్తుండగా.. అంబులెన్స్‌కు దారి ఇచ్చి గొప్పతనాన్ని చాటుకున్నారు. కోయంబత్తూరు- వెలచెరి మార్గంలో తన కాన్వాయ్‌ వెళ్తుండగా..అదే సమయంలో వెనకనుంచి ఓ అంబులెన్స్‌ వేగంగా వస్తుండటం స్టాలిన్‌ గమనించారు. రోడ్డుకు ఎడమవైపు కాన్వాయ్‌ను ఆపించి..

Updated : 02 Nov 2021 05:05 IST

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు. తన కాన్వాయ్‌ వెళ్తుండగా.. అంబులెన్స్‌కు దారి ఇచ్చి గొప్పతనాన్ని చాటుకున్నారు. కోయంబత్తూరు- వెలచెరి మార్గంలో తన కాన్వాయ్‌ వెళ్తుండగా..అదే సమయంలో వెనకనుంచి ఓ అంబులెన్స్‌ వేగంగా వస్తుండటం స్టాలిన్‌ గమనించారు. రోడ్డుకు ఎడమవైపు కాన్వాయ్‌ను ఆపించి, అంబులెన్స్‌కు మార్గాన్ని కల్పించారు. కాన్వాయ్‌ను ఆపి, అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం స్టాలిన్‌పై తమిళనాడు ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను అనేకమంది నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని