Delta plus: తమిళనాడులో తొలి మరణం

దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతూ వణుకు పుట్టిస్తున్న కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వైరస్‌ తాజాగా తమిళనాడుకూ పాకింది. ఈ రకం వైరస్‌తో తమిళనాడులో తొలి మరణం సంభవించినట్లు

Published : 26 Jun 2021 16:52 IST

చెన్నై: దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతూ వణుకు పుట్టిస్తున్న కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వైరస్‌ తాజాగా తమిళనాడుకూ పాకింది. ఈ రకం వైరస్‌తో తమిళనాడులో తొలి మరణం సంభవించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ధ్రువీకరించింది. మదురైకి చెందిన ఓ వ్యక్తి డెల్టా ప్లస్‌ స్ట్రెయిన్‌తో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఎమ్‌ఏ సుబ్రమణియన్‌ వెల్లడించారు. మదురై రోగి మరణించిన తరువాత నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో డెల్టా ప్లస్ వేరియంట్‌ వైరస్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో డెల్టా ప్లస్ స్ట్రెయిన్‌ సోకిన వారిలో చెన్నైకి చెందిన ఓ నర్సు, కాంచీపురం జిల్లాకు చెందిన మరొకరు కోలుకున్నట్లు చెప్పారు.     

దేశంలో ఇప్పటివరకు 45 వేల నమూనాలను పరీక్షించగా.. వాటిలో 51 డెల్టా ప్లస్‌ స్ట్రెయిన్‌ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వైరస్‌కు సంబంధించి మొత్తం కేసుల్లో మహారాష్ట్రలో 22, తమిళనాడుతో 9, మధ్యప్రదేశ్‌లో 7, కేరళలో 3, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో రెండు చొప్పున, అంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు డెల్టా ప్లస్‌ వైరస్‌ సోకి మృతి చెందారు. ఈ కేసులు నమోదైన రాష్ట్రాల్లో కొవిడ్‌ నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్రం సూచించింది.    

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని