తెలుగేతర రాష్ట్రాల్లో తెలుగు భాష నేర్పిస్తాం: టీసీడబ్ల్యూఏ

తెలుగు భాషను మాట్లాడేవారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ రాష్ట్రాలు, అనేక దేశాల్లోనూ ఉన్నారు. అయితే, వారుంటున్న ప్రాంతాల్లో అక్కడి సంస్కృతి, సంప్రాదాయాలకు అలవాటు పడి తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి దూరమవుతున్నారు. అందుకే, అలాంటి వారికి తెలుగును

Published : 30 Dec 2021 20:28 IST

నాగ్‌పూర్: తెలుగు భాషను మాట్లాడేవారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ రాష్ట్రాలు, అనేక దేశాల్లోనూ ఉన్నారు. అయితే, వారుంటున్న ప్రాంతాల్లో అక్కడి సంస్కృతి, సంప్రాదాయాలకు అలవాటు పడి తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి దూరమవుతున్నారు. అందుకే, అలాంటి వారికి తెలుగును తిరిగి చేరువ చేసేందుకు మహారాష్ట్రలోని తెలుగు కమ్యూనిటీ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ (టీసీడబ్ల్యూఏ) నడుం బిగించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, విదేశాల్లో తెలుగు భాష, తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

తెలుగేతర రాష్ట్రాల్లో చాలా మంది తెలుగు వారు ఉన్నారు. కానీ, అక్కడి పాఠశాలల్లో తెలుగు బోధించరు. దీంతో తెలుగు సంస్కృతి గురించి వారికి తెలియట్లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుపై ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని టీసీడబ్ల్యూఏ నిర్ణయించింది. జనవరి 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు టీసీడబ్ల్యూఏ అధ్యక్షుడు పీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తెలుగు ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని