
Updated : 18 Jan 2022 11:12 IST
Chandrababu: అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్: చంద్రబాబు
అమరావతి: తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు నందమూరి తారక రామారావు ప్రతీక అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం నిరంతరం పని చేస్తోందని పేర్కొన్నారు. కథానాయకునిగా, మహా నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నా అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
భారతరత్నతో గౌరవించుకోవాలి: రఘురామ
ఎన్టీఆర్కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దిల్లీ నుంచి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్టీఆర్ జయంతి రోజుకు ఆయనను భారతరత్నతో సత్కరించుకోవాలన్నారు. భారతరత్నతో తెలుగుజాతిని గౌరవించుకోవాలని రఘురామ చెప్పారు.
Tags :