JR Pushparaj: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి జేఆర్‌ పుష్పరాజ్‌ కన్నుమూత

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి జేఆర్‌ పుష్పరాజ్‌ కన్నుమూశారు. ఏడాది క్రితం కొవిడ్‌ బారిన పడిన ఆయన వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు

Published : 28 Jul 2022 17:52 IST

అమరావతి: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి జేఆర్‌ పుష్పరాజ్‌ కన్నుమూశారు. ఏడాది క్రితం కొవిడ్‌ బారిన పడిన ఆయన వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యులు ఇటీవలే గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. గతేడాది డిసెంబరులో పుష్పరాజ్‌ ఇంటికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న పుష్పరాజ్‌ 1983, 1985, 1999లో తాడికొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఏపీ ఆహార కమిషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని