TTD: తితిదే మాజీ ఈవో, ఛైర్మన్‌పై తెదేపా నేతల ఫిర్యాదు

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డిపై సీఎస్‌ నీరభ్‌కుమార్‌కు తెదేపా నేతలు గురజాల మాల్యాద్రి, నీలయపాలెం విజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. 

Updated : 08 Jul 2024 18:47 IST

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డిపై సీఎస్‌ నీరబ్‌కుమార్‌కు తెదేపా నేతలు గురజాల మాల్యాద్రి, నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై సీబీ సీఐడీ లేదా విజిలెన్స్‌ శాఖతో విచారణ జరిపించి అక్రమాలను వెలికి తీయాలని కోరారు. 

నియమాలకు విరుద్ధంగా ఐఏఎస్‌ అధికారిని కాకుండా ధర్మారెడ్డిని జేఈవోగా తర్వాత ఈవోగా అప్పటి జగన్‌ సర్కార్‌ నియమించిందని తెదేపా నేతలు ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను ధర్మారెడ్డి దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైకాపాకు విరాళాల సేకరణకు మార్గంగా మార్చుకున్నారని విమర్శించారు. తిరుమలలో అతిథిగృహాలకు కేటాయించే భూముల్లో కూడా ధర్మారెడ్డి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని మండిపడ్డారు. ధర్మారెడ్డి మొబైల్‌ ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తే క్రిమినల్‌ కేసుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కాపాడేందుకు దిల్లీలో ఆయన రాజకీయ ప్రమేయం, కుతంత్రాలు స్పష్టంగా తేటతెల్లమవుతాయని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని