Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెదేపా

తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. 

Published : 22 Sep 2023 17:12 IST

అమరావతి: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. న్యాయపోరాటం దృష్ట్యా మరి కొన్ని రోజులు దిల్లీలోనే ఉండాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్ణయించారు. ఎప్పటికప్పుడు న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై లాయర్లతో చర్చిస్తున్నారు. లోకేశ్‌ శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం రావాలనుకున్నప్పటికీ .. హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ తిరస్కరణతో పరిణామాలు మారాయి. 

మరో వైపు చంద్రబాబు రిమాండ్‌ను ఈనెల 24 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు, రెండ్రోజుల పాటు చంద్రబాబును సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు తీర్పు, సీఐడీ కస్టడీ తదితర అంశాలపై న్యాయవాది లక్ష్మీనారాయణ.. చంద్రబాబుతో చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు