Andhra News: తెలుగుదేశం పార్టీ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌

తెదేపా ట్విటర్‌ హ్యాండిల్‌ స్థానంలో ‘టైలర్‌ హాబ్స్‌’ అనే పేరు ప్రత్యక్షం అవడంతో హ్యాక్‌ గురైనట్లు గుర్తించారు. టైలర్‌ హాబ్స్‌ పేరుతో కొన్ని పేయింటింగ్‌ చేసిన ఫొటోలు కూడా షేర్‌ చేశారు.

Updated : 01 Oct 2022 18:48 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక ట్విటర్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది. తెదేపా ట్విటర్‌ హ్యాండిల్‌ స్థానంలో ‘టైలర్‌ హాబ్స్‌’ అనే పేరు ప్రత్యక్షం అవడంతో హ్యాక్‌కు గురైనట్లు గుర్తించామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ట్విటర్‌ ఖాతాలో తెదేపా పోస్టులకు బదులుగా విజువల్‌ ఆర్ట్స్‌కు చెందిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ట్విటర్‌ హ్యాండిల్‌లో క్యూక్యూఎల్‌ (QQL) క్రియేటర్‌ అని రాసి ఉంది. అకౌంట్‌ హ్యాక్‌ అవ్వడం వెనుక వైకాపా మద్దతు దుష్టశక్తులు ఉన్నాయని పార్టీ శ్రేణులు ఆరోపించాయి. దీనిపై ఫిర్యాదు చేశామని.. మరికాసేపట్లోనే తిరిగి పునరుద్ధరిస్తామని వెల్లడించాయి. గతంలోనూ ఇలాగే తెదేపా ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. కొన్ని గంటలపాటు శ్రమించిన తర్వాత ఖాతాను మళ్లీ పునరుద్ధరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని