Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు

సీఎంగా తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.

Updated : 12 Jun 2024 09:13 IST

విజయవాడ: సీఎంగా తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఉదయమే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ సహా ప్రముఖులు హాజరు కానుండటంతో పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలోకి వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. కనకదుర్గ వారధిపై బారికేడ్లు అడ్డుపెట్టడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. విజయవాడ-గన్నవరం మార్గంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలతో కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. 

మరోవైపు గుంటూరు జిల్లా కాజా టోల్‌ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. టోల్‌ రుసుం కోసం వాహనాలను సిబ్బంది నిలిపివేశారు. దీంతో సుమారు 2కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ జామ్‌తో ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని