Bapatla: పాఠాలు చెబుతుండగానే గుండెపోటు.. కుర్చీలోనే ఉపాధ్యాయుడు మృతి
బాపట్ల జిల్లాలో పాఠాలు చెబుతూ ఉపాధ్యాయుడు కుర్చీలోనే గుండెపోటుతో మరణించారు. దీంతో పాఠశాల విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు విషాదంలో మునిగిపోయారు.
చీరాల నేర విభాగం: విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు (Teacher) ఒక్కసారిగా గుండెపోటుతో (Heart attack) కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లాలో (Bapatla) శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంకొల్లు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వీరబాబు (45) వేటపాలెం మండలం వాకావారి పాలెంలో విధులు నిర్వహిస్తున్నారు.
యథావిధిగా శనివారం విధులకు హాజరైన వీరబాబు.. విద్యార్థులకు పాఠాలు చెబుతుండగానే గుండెపోటు రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన విద్యార్థులు ఇతర ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే 108కి ఫోన్ చేసి సమాచారం అందజేశారు. వీరబాబుకి వైద్య సేవలు చేసిన సిబ్బంది అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్దారించారు. తమకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడి మృతిని కళ్లారా చూసిన విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ తోటి ఉపాధ్యాయుడు అకస్మాత్తుగా కుర్చీలోనే ప్రాణాలు విడవడంతో మిగతా ఉపాధ్యాయులు విషాదంలో మునిగిపోయారు. వీరబాబు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల