Teachers Protest: విశాఖలో ఉపాధ్యాయుల మహా నిరసన

సీపీఎస్‌ రద్దు, టెన్త్‌ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్‌, ఇతర సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు

Updated : 17 May 2022 10:40 IST

విశాఖ: సీపీఎస్‌ రద్దు, టెన్త్‌ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్‌, ఇతర సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాలు విశాఖలో మహా నిరసన చేపట్టాయి. క్వీన్‌మేరీ పాఠశాల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులు తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. తమ సమస్యలను ఎన్నో సార్లు ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని.. అందుకే నిరసనకు దిగాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు చెప్పారు.

పదో తరగతి పరీక్ష పేపర్ల వాల్యుయేషన్‌కు సంబంధించి గతంలో 50 మార్కుల పేపర్‌కు రూ.6 ఇచ్చేవారని.. ఇప్పుడు పేపర్‌ 100 మార్కులైనా అదే మొత్తం ఇస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్‌సీ, డీఏలు, రావాల్సిన రాయితీల్లో ప్రభుత్వం తమకు మొండిచేయి చూపిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని