AP PRC: స్టీరింగ్‌ కమిటీకి ఉపాధ్యాయ సంఘాల రాజీనామా

పీఆర్సీ అంశంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీకి మూడు ఉపాధ్యాయ 

Updated : 08 Feb 2022 13:10 IST

అమరావతి: పీఆర్సీ అంశంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ నుంచి పలు ఉపాధ్యాయ సంఘాలు వైదొలిగాయి. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తమ సంఘాలు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయా సంఘాల నేతలు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. అనంతరం ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు, యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.

చర్చల్లో స్టీరింగ్‌ కమిటీ ఏకపక్షంగా వ్యవహరించిందని.. రాష్ట్రంలోని జేఏసీ ఛైర్మన్లకు తమ రాజీనామాలను పంపుతున్నామని చెప్పారు. పీఆర్సీపై తదుపరి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 5 రోజులపాటు నిరసనలు కొనసాగించనున్నట్లు నేతలు వివరించారు. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కార్యాచరణపై చర్చిస్తామన్నారు. తమతో కలిసివచ్చే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఉద్యమిస్తామని.. సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని నేతలు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలని నేతలు కోరారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని