Hyderabad: సాంకేతికలోపంతో స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి.. ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్‌ నుంచి నాసిక్‌ బయల్దేరిన స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.

Updated : 06 Dec 2022 14:09 IST

శంషాబాద్‌: హైదరాబాద్‌ నుంచి నాసిక్‌ బయల్దేరిన స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. 3 గంటలకు పైగా సమయం దాటినా మరో విమానం ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు.

హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి స్పైస్‌ జెట్‌ విమానం ఉదయం 6.20 గంటలకు బయల్దేరింది. సుమారు 30 నిమిషాల ప్రయాణం తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. దీంతో విమానాన్ని తిరిగి హైదరాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. మరో విమానం ఏర్పాటు చేయకపోవడం, గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అధికారుల నుంచి సరైన స్పందనలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని