Hyderabad : హైదరాబాద్‌లో 15 వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

జీహెచ్‌ఎంసీ పరిధిలో మూసీ, ఈసీ నదులపై వంతెనల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. రూ.545 కోట్ల వ్యయంతో 15 వంతెనలు నిర్మించాలని నిర్ణయించింది.

Updated : 29 Jan 2022 17:19 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో మూసీ, దాని ఉపనది ఈసాపై వంతెనల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. రూ.545 కోట్ల వ్యయంతో 15 వంతెనలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. వంతెనల నిర్మాణం కోసం 50శాతం హెచ్‌ఎండీఏ నిధులను వినియోగించగా..మరో 50 శాతం నిధులను రుణాల ద్వారా జీహెచ్‌ఎంసీ సమకూర్చుకోనుంది. ఈ మేరకు వంతెనల నిర్మాణానికి పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని