Telangana : మార్కెట్‌ విలువల పెంపుతో స్థిరాస్తి రంగంపై ప్రభావం: తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌

మార్కెట్ విలువల పెంపుతో స్థిరాస్తి రంగంపై ప్రభావం పడుతుందని తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలుదారులు

Updated : 03 Feb 2022 19:02 IST

హైదరాబాద్‌: మార్కెట్ విలువల పెంపుతో స్థిరాస్తి రంగంపై ప్రభావం పడుతుందని తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలుదారులు ముందుకు రావట్లేదన్నారు. అడ్వాన్స్‌లు ఇచ్చిన వారు వాయిదా వేసుకుంటున్నారని చెప్పారు. మార్కెట్‌ విలువల పెంపును రెండేళ్లు వాయిదా వేయాలని కోరారు. పెంపులో మార్పు లేకపోతే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలైనా తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కొనుగోలుదారుడు బక్కచిక్కితే స్థిరాస్తి రంగానికే మనుగడ ఉందన్నారు. మార్కెట్‌ విలువలు పెరగడం వల్ల నాలా ఛార్జీలు, ఎల్‌ఆర్‌ఎస్ ఛార్జీలు తదితర వాటిపై ప్రభావం ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని