Telangana News: సెప్టెంబరు 17 జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తాం: కేబినెట్‌

రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని

Updated : 03 Sep 2022 20:11 IST

హైదరాబాద్‌: రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తామని కేబినెట్‌ తెలిపింది.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts