CM KCR: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఇందులో నిర్వహిస్తున్న మొదటి మంత్రివర్గ సమావేశం ఇదే. 

Published : 18 May 2023 16:00 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఇందులో నిర్వహిస్తున్న మొదటి మంత్రివర్గ సమావేశం ఇదే. జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక, గవర్నర్‌ తిరస్కరించిన బిల్లులను తిరిగి ఆమోదించడానికి శాసనసభ సమావేశాలను నిర్వహించడం, రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ తరుణాన ప్రజలకు మేలు చేకూర్చే ఏదైనా కొత్త పథకం ప్రకటన.. తదితర అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని