TG cabinet: తెలంగాణలో రైతులకు శుభవార్త.. పంట రుణాల మాఫీకి మంత్రివర్గం నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 

Published : 21 Jun 2024 17:45 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 2023 డిసెంబర్‌ 9లోపు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించనుంది. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని గతంలోనే రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు.. అందుకు కావాల్సిన నిధుల సమీకరణ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని