CM KCR: సింగరేణి ఉద్యోగులకు సీఏం కేసీఆర్‌ దసరా కానుక

సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా కానుక ప్రకటించారు. 2021 -22 సంవత్సరానికి

Published : 28 Sep 2022 15:09 IST

హైదరాబాద్‌: సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా కానుక ప్రకటించారు. 2021 -22 సంవత్సరానికి సింగరేణి కాలరీస్ సంస్థ గడిచిన లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు అందించాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. ఈ మేరకు సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అర్హులైన కార్మికులకు రూ.368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది. 2020, 2021లో కార్మికులకు లాభాల్లో వరుసగా 28%, 29% వాటాను దసరా కానుకగా చెల్లించిన విషయం తెలిసిందే.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts