‘దళిత బంధు’ అమలుపై సీఎం సమీక్ష 

తెలంగాణలో అమలు చేయ తలపెట్టిన దళిత బంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్‌ అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. పథకం విధి విధానాలు, ఉపాధి పథకాలపై అధికారులతో సీఎం చర్చలు జరిపారు. ఉత్పత్తిలో భాగస్వాములు అయినపుడే దళిత సాధికారతకు...

Updated : 20 Jul 2021 04:47 IST

హైదరాబాద్‌: తెలంగాణలో అమలు చేయ తలపెట్టిన దళిత బంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్‌ అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. పథకం విధి విధానాలు, ఉపాధి పథకాలపై అధికారులతో సీఎం చర్చలు జరిపారు. ఉత్పత్తిలో భాగస్వాములు అయినపుడే దళిత సాధికారతకు నిజమైన అర్థం చేకూరుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆర్థిక స్వావలంబనకు వినూత్న ఉపాధి పథకాలు రూపొందించాలని, దళిత కుటుంబాల స్థితిగతులపై పైలట్‌ ప్రాజెక్ట్‌ గ్రామాల్లో పర్యటించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎస్సీల అభ్యున్నతికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, దళిత సంఘాల నేతలతో త్వరలో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలు గుర్తించి అనుసంధానంలో సహకరించాలని సీఎం పేర్కొన్నారు. గ్రామ, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో సమస్యలు గుర్తించాలన్నారు. 33 జిల్లాల అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు. హుజూరాబాద్‌ అనుభవాలు రాష్ట్రంలో పథకం అమలుకు ఉపయుక్తం అవుతాయని సీఎం తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని