ప్రాజెక్టులకు నిధుల సమీకరణ పూర్తి చేయండి

కాళేశ్వరం ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులు వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుకులకు నిధుల సమీకరణపై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.  నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను..

Updated : 21 Jul 2020 21:28 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: కాళేశ్వరం ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులు వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుకులకు నిధుల సమీకరణపై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.  నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ నిర్మాణ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. నీటి లభ్యత సమయంలో ప్రతి రోజూ నీటిని తరలించేలా ప్రాజెక్టుల నిర్మాణం ఉండాలని చెప్పారు. గోదావరి నుంచి 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులు ఉండాలని పేర్కొన్నారు. నీటి తరలింపు ద్వారా 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. బడ్జెట్‌ నిధులతోపాటు వివిధ సంస్థల నుంచి నిధులు సేకరిస్తున్నామని వెల్లడించారు. ప్రాజెక్టులకు ఆర్థిక సాయానికి సంబంధించి వివిధ సంస్థలతో  ఒప్పందాలు పూర్తైనట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వం తరఫున కట్టాల్సిన వాటాను చెల్లించాలని సూచించారు. వర్షాకాలం పూర్తి కాగానే ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని