దళిత సాధికారత పథకం అమలుకు పటిష్ఠ కార్యాచరణ: కేసీఆర్‌

ఎస్సీల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. లక్ష్య సాధనలో ఎస్సీ మేధావి వర్గం కలిసిరావాలన్నారు. ఎస్సీ మేధావులు, ప్రొఫెసర్లు, ఎస్సీ, ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం, మాదిగ మేధావుల ఫోరం, విద్యావంతుల వేదిక, ఓయూ నాన్‌ టీచింగ్‌ వెల్ఫేర్‌ ...

Updated : 24 Sep 2022 15:17 IST

హైదరాబాద్: ఎస్సీల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. లక్ష్య సాధనలో ఎస్సీ మేధావి వర్గం కలిసిరావాలన్నారు. ఎస్సీ మేధావులు, ప్రొఫెసర్లు, ఎస్సీ, ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం, మాదిగ మేధావుల ఫోరం, విద్యావంతుల వేదిక, ఓయూ నాన్‌ టీచింగ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు సీఎంను కలిశారు. ఎస్సీ సాధికారత పథకం పట్ల సీఎం కేసీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ  సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పథకం అమలుకు పటిష్ఠ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పథకానికి తగిన సూచనలు సలహాలు అందించాలని కోరారు. భవిష్యత్‌లో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయబోతున్నామని, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సాయం చేస్తామని సీఎం అన్నారు. ఎస్సీ సాధికారత సాధించి దేశానికి ఆదర్శంగా నిలుద్దామన్నారు. ఎస్సీల సమస్యల పరిష్కారానికి విధానాలపై ఆలోచించాలని, వివిధ వర్గాలతో మరిన్ని భేటీలు ఏర్పాటు చేస్తామని సీఎం పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు