
TS Corona : తెలంగాణలో కొత్తగా 3,980 కరోనా కేసులు.. 3 మరణాలు
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 97,113 నమూనాలను పరీక్షించగా 3,980 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,38,795కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,398 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7,01,047 మంది కరోనా నుంచి బయటపడినట్లు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. మరో 33,673 మంది చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.89 శాతంగా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 1439 మందికి పాజిటివ్‌గా తేలింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.