TS COVID update: తెలంగాణలో 160 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా మరో 160 కేసులు నమోదు కాగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24గంటల వ్యవధిలో

Published : 01 Nov 2021 19:41 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా మరో 160 కేసులు నమోదు కాగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24గంటల వ్యవధిలో 35,326 శాంపిల్స్‌ పరీక్షించగా.. 160 మందిలో వైరస్‌ నిర్ధారణ అయినట్టు అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు. అలాగే, కొత్తగా 193మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

తెలంగాణలో ఇప్పటివరకు 2.76కోట్లకు పైగా శాంపిల్స్‌ పరీక్షించగా.. 6.71లక్షలకు పైగా కొవిడ్ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ బారిన పడినవారిలో 6.63 లక్షల మందికి పైగా కోలుకోగా.. 3958మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3974 క్రియాశీల కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 98.81శాతం కాగా.. మరణాల రేటు 0.58శాతంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు