30లక్షల టీకాలు కావాలి: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

తెలంగాణ రాష్ట్రానికి అత్యవసరంగా 30 లక్షల డోసులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో..

Updated : 11 Apr 2021 12:30 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి అత్యవసరంగా 30 లక్షల డోసులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5.66 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని సీఎస్‌ పేర్కొన్నారు. నిత్యం లక్షకుపైగా టీకాలు వేస్తున్నామని.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలు కేవలం మూడు రోజులకు మాత్రమే సరిపోతాయని లేఖలో వివరించారు. కరోనా కట్టడికి అత్యవసరంగా టీకాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని