TS EAMCET: 12న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు వెల్లడి?

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు ఈనెల 12న విడుదలయ్యే అవకాశముంది. ఎంసెట్‌ కమిటీ రేపు ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్‌

Published : 10 Aug 2022 17:38 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు ఈనెల 12న విడుదలయ్యే అవకాశముంది. ఎంసెట్‌ కమిటీ రేపు ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్‌, 30, 31న అగ్రికల్చర్‌, ఫార్మా ఎంసెట్‌ నిర్వహించారు. ఇంజినీరింగ్‌కు 1,56,812 మంది, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.  ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్‌ కమిటీ విశ్లేషించి నిర్ణయం తీసుకోనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయాన్ని బట్టి ఈనెల 12 లేదా 13న ఫలితాలను ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని