Telangana News: మరోసారి తెరపైకి ఏపీ, తెలంగాణ జలవివాదం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య మరోసారి జల వివాదం తెరపైకి వచ్చింది. ఏపీ చేపట్టిన పంప్డ్‌ హౌస్‌ హైడ్రో స్టోరేజ్‌ పథకాలపై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ ఫిర్యాదు చేశారు.

Published : 31 May 2022 17:47 IST

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య మరోసారి జల వివాదం తెరపైకి వచ్చింది. ఏపీ చేపట్టిన పంప్డ్‌ హౌస్‌ హైడ్రో స్టోరేజ్‌ పథకాలపై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ ఫిర్యాదు చేశారు. అనుమతుల్లేని ప్రాజెక్టులను నిలువరించాలని లేఖలో పేర్కొన్నారు. ఏపీ పంప్డ్‌ పథకాల వివరాలను తెప్పించి ఇవ్వాలని బోర్డును కోరారు. కర్నూలు జిల్లా పెన్నాపురం వద్ద  చేపట్టిన గ్రీన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టుపై కూడా ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు కోసం కృష్ణా జలాలను వినియోగించరాదని స్పష్టం చేశారు. కృష్ణా నుంచి ఇతర బేసిన్లకు జలాల తరలింపు, జల విద్యుత్‌ కోసం కృష్ణా జలాల వినియోగంపైనా తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం తెలిపారు. అపెక్స్‌ కౌన్సిల్‌, బోర్డు అనుమతుల్లేని ప్రాజెక్టులు ఆపాలని కేఆర్‌ఎంబీని ఈఎన్సీ మురళీధర్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని