Tamilisai: గవర్నర్‌గా నియమించినప్పుడు అనుభవం లేదని విమర్శలొచ్చాయి: తమిళిసై

తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రెండు రాష్ట్రాల్లో గవర్నర్‌ వ్యవస్థను ఎలా నిర్వహిస్తారని

Published : 08 May 2022 12:29 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గవర్నర్‌గా తనను నియమించినప్పుడు చాలా మంది అనుమానపడ్డారని తెలిపారు. ఎలాంటి అనుభవం లేదని తనపై విమర్శలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. గైనకాలజిస్టుగా శిశువులకు చికిత్స అందించడంలో తనకు విశేష అనుభవం ఉందని గవర్నర్‌ తెలిపారు. వైద్యవృత్తి ఇచ్చిన ధైర్యంతోనే గవర్నర్‌గా ముందుకెళ్తున్నట్లు ఆమె వివరించారు. నగరంలోని కేర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ మాట్లాడారు. వైద్యానికి సంబంధించిన అంశాలపై తనను సంప్రదించవచ్చని తెలిపారు. మహిళలు, చిన్నారుల సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ గవర్నర్‌ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.

‘రెడ్‌క్రాస్‌ డే’ వేడుకల్లో గవర్నర్‌..

మరోవైపు రాజ్‌భవన్‌లో జరిగిన రెడ్‌క్రాస్‌ డే వేడుకల్లో గవర్నర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో పోలీసులు, సైనికులు చాలా సహకరించారన్నారు. రక్తం అవసరమైన వారికి సాయం చేయడంలో కృషి చేశారని తెలిపారు. తలసేమియాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని ఆమె వివరించారు. రెడ్‌క్రాస్‌ సంస్థ అన్ని జిల్లాల్లో తమ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. రెడ్‌క్రాస్‌ సంస్థ జిల్లాల్లో బ్లడ్‌ బ్యాంక్‌, క్లినిక్‌ల వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ఎదుటివారి పట్ల దయతో, మానవత్వంతో మెలగాలని గవర్నర్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని