Ts News: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు తెలంగాణ సర్కార్‌ మరో అవకాశం

ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 58, 59జీవోల కింద జారీ చేసిన ఉత్తర్వులకు లోబడి క్రమబద్ధీకరణ కోసం...

Published : 15 Feb 2022 01:39 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 58, 59జీవోల కింద జారీ చేసిన ఉత్తర్వులకు లోబడి క్రమబద్ధీకరణ కోసం మళ్లీ దరఖాస్తులను స్వీకరించనుంది. ఇందుకోసం మీసేవా కేంద్రాల ద్వారా ఈ నెల 21వ తేదీ నుంచి మార్చ్ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2014 జూన్ రెండో తేదీ కటాఫ్‌గా క్రమబద్ధీకరణ చేయనున్నారు. 58, 59జీవోల కింద జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాలను నిర్ణీత రుసుముతో క్రమబద్ధీకరణ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని