Telangana News: ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంపు ఉత్తర్వులు జారీ

ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 80వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌..

Published : 20 Mar 2022 01:40 IST

హైదరాబాద్‌: ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 80వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వయో పరిమితిని కూడా పెంచుతామని స్పష్టం చేశారు. అందుకు అనుగుణగా సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయో పరిమితిని పదేళ్లపాటు పెంచింది. దీంతో 34 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ అర్హత వయస్సు 44 ఏళ్లకు పెరిగింది. గరిష్ఠ వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తించనుంది. ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే, యూనిఫాం సర్వీసులైన పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మాత్రం గరిష్ఠ వయో పరిమితి పెంపు వర్తించదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని