
KRMB: టెండర్ ప్రక్రియ కొనసాగించకుండా ఏపీని నిలువరించాలి: కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ ప్రక్రియ చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. టెండర్ ప్రక్రియ కొనసాగించకుండా ఏపీని నిలువరించాలనని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.
‘‘ట్రైబ్యునల్, విభజన చట్టానికి విరుద్ధంగా విస్తరణ పనులు చేపట్టడంపై గతంలోనే పలుమార్లు ఫిర్యాదు చేశాం. నిప్పులవాగు ఎస్కేప్ కెనాల్‌ను గెజిట్ నోటిఫికేషన్ రెండో షెడ్యూల్లో చేర్చాలని కూడా కోరాం. అనుమతుల్లేకుండా బనకచర్ల వద్ద ఎస్కేప్ రెగ్యులేటర్ నిర్మాణాన్ని బోర్డు దృష్టికి తీసుకురావడంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ కేవలం 34 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకునేలా చూడాలని గతంలోనే విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంబంధిత పనులకు ఈ మే 6వ తేదీన ఏపీ ప్రభుత్వం పలు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసింది. మే 23 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చింది.
నీరు తక్కువగా ఉన్న కృష్ణా బేసిన్ నుంచి పెద్ద మొత్తంలో జలాలను ఇతర బేసిన్లకు తరలించడం తీవ్ర ప్రభావం చూపుతుంది. నదీ వ్యవస్థతో పాటు జంతుజాలం, వన్యప్రాణులు, పర్యావరణం, మత్స్య సంపదపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. తద్వారా సహజ వనరులను పొందకుండా బేసిన్‌లోని ప్రజల హక్కులను కాలరాసినట్లు అవుతుంది. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి తీసుకోకుండా చూడాలని పదేపదే బోర్డును కోరుతున్నాం. ప్రతిపాదిత విస్తరణ పనులు శ్రీశైలం నుంచి సాగర్ వరకు తెలంగాణ ప్రాంతంలోని కృష్ణా బేసిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి. 2014 జూన్ తర్వాత చేపట్టే ఏ ప్రాజెక్టు అయిన విభజన చట్టానికి లోబడే జరగేలా చూడాలి. వీటన్నింటి నేపథ్యంలో పోతిరెడ్డిపాడు విస్తరణ, సంబంధిత పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ఏపీ కొనసాగించకుండా నిలువరించాలి’’ అని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
-
Ap-top-news News
Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
-
General News
Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆత్మహత్యలే
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి