KRMB: మా విజ్ఞప్తిని కృష్ణాబోర్డు తప్పుగా అర్థం చేసుకుంది: తెలంగాణ ఈఎన్సీ

గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణానది యాజమాన్య

Updated : 13 Aug 2022 05:45 IST

హైదరాబాద్‌: గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కేఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పనులు చేపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రెండు ప్రాజెక్టుల విస్తరణ పనులకు అనుమతి ఇవ్వడం తగదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేసిన్ వెలుపలకు కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశాం. అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను నిలువరించాలని కృష్ణా బోర్డును కోరాం. వాటికి పర్యావరణ అనుమతులు నిలుపుదల చేయాలని.. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాయాలని విజ్ఞప్తి చేశాం. రూల్ కర్వ్స్ ఖరారు కోసం తెలంగాణ ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఇవ్వండి. మా విజ్ఞప్తిని కృష్ణా బోర్డు తప్పుగా అర్థం చేసుకుంది. రూల్ కర్వ్స్ ఖరారు కోసం ఎస్‌ఆర్‌బీసీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తదితరాల అనుమతుల వివరాలు తప్పనిసరి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనధికారికంగా పెద్దమొత్తంలో కృష్ణా నీటిని బేసిన్ వెలుపలకు తరలిస్తోంది. ఏపీ అక్రమ జల తరలింపును ఎత్తి చూపేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాం. రూల్ కర్వ్స్ ఖరారుకు ముందు కొన్ని ఒప్పందాలు అవసరం. తదుపరి ఆర్ఎంసీ సమావేశం నాటికి మేము అడిగిన సమాచారం, వివరాలు ఇవ్వాలి’’ అని లేఖలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు