Telangana news : ‘మన ఊరు మన బడి’ విధివిధానాలు ఖరారు

సర్కారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూపొందించిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు

Updated : 03 Feb 2022 19:42 IST

హైదరాబాద్: సర్కారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూపొందించిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు విధివిధానాలపై విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 7,289.54 కోట్లతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టనుంది. మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్‌ విద్య వంటివి చేపట్టనుంది. 

గ్రామాల్లో ‘మన ఊరు-మన బడి’, పట్టణాల్లో అయితే ‘మన బస్తీ-మన బడి’గా ప్రభుత్వం రూపొందించింది. మూడేళ్లలో అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో కార్యక్రమం చేపట్టనుంది. మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ. 3,497.62 కోట్లతో పనులు చేపట్టేందుకు కార్యాచరణ ప్రారంభించనుంది. ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో తొలిదశ కార్యక్రమం చేపట్టనుంది. 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనుంది. కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలకు పూర్వ విద్యార్థుల సంఘం, పాఠశాల విద్యా కమిటీల ద్వారా అభివృద్ధి పనులను నిర్వహిస్తుంది. విరాళాలు, సీఎస్‌ఆర్‌ నిధుల కోసం ప్రత్యేక ఖాతా తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని