Junior doctors protest: జూడాల సమ్మె తాత్కాలిక విరమణ.. రెండు జీవోలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

జూనియర్‌ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. 

Updated : 26 Jun 2024 14:41 IST

హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి 79.50 కోట్లు, కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.

మరోవైపు గాంధీ ఆసుపత్రిలో జూడాలు సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి హాజరయ్యారు. వైద్యారోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూడాలు తమ డిమాండ్లపై అంతర్గత చర్చలు జరుపుతున్నారు.

సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూనియర్‌ డాక్టర్లు (జూడా) ప్రకటించిన విషయం తెలిసిందే. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. ఈక్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. బుధవారం ఇందుకు సంబంధించి రెండు జీవోలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీవోలు విడుదల కాకపోతే మళ్లీ సమ్మె కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా రెండు జీవోలు విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని