Telangana News: గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది

Published : 07 Aug 2022 01:56 IST

హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లలోనూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం 1.15 గంటల వరకు చిత్రాన్ని ప్రదర్శించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనెల 9 నుంచి 11 వరకు, 16 నుంచి 21 వరకు అన్ని థియేటర్లలోనూ ఉచిత ప్రదర్శన చేయాలని ఆదేశిస్తూ ప్రత్యేక మెమో జారీ చేసింది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు అనుకూలమైన ఫార్మెట్‌ను డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లైన క్యూబ్, యూఎఫ్ఓలకు అందజేయాలని చలన చిత్ర అభివృద్ధి సంస్థకు సూచించింది. ఈ సినిమాను తప్పనిసరిగా ప్రదర్శితమయ్యేలా సంబంధిత అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని