TS News: గవర్నర్‌ బిల్లులు పెండింగ్‌లో పెట్టారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్‌

గవర్నర్‌ బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పటివరకు 10 బిల్లులు పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated : 02 Mar 2023 17:03 IST

దిల్లీ: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల (Bills pending)పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme court)ను ఆశ్రయించింది. గవర్నర్‌ బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటివరకు 10 బిల్లులు పెండింగ్‌లో పెట్టారని పేర్కొంది. సెప్టెంబరు నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖను చేర్చింది. 

తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు, ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత, పురపాలక నిబంధనల, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌, ప్రైవేటు విశ్వవిద్యాలయాల, మోటర్‌ వాహనాల పన్ను, పురపాలక, పంచాయతీరాజ్, వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని