దుకాణాల సమయం కుదింపుపై సీఎస్‌ స్పష్టత

రాష్ట్రంలో ఇటీవల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పుకార్లు జోరందుకున్నాయి. రాత్రివేళ దుకాణాల సమయాన్ని కుదిస్తున్నారంటూ...

Published : 02 Apr 2021 02:01 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పుకార్లు జోరందుకున్నాయి. రాత్రివేళ దుకాణాల సమయాన్ని కుదిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు దర్శనమిచ్చాయి. దీంతో ఈ పుకార్లపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లోని జీవో కాపీ నకిలీదని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ చెప్పారు. రాత్రివేళ దుకాణాలు మూసివేత వార్త తప్పుడు ప్రచారమని ఆయన పేర్కొన్నారు. దుకాణాలు సాయంత్రం 6 గంటలకు మూసివేయాలనేది నిజం కాదన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉండదని సీఎస్‌ స్పష్టం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు