ST Reservations: తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల శాతం పెంపు.. తక్షణమే అమల్లోకి

తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated : 01 Oct 2022 01:54 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు  విడుదల చేశారు. గిరిజన రిజర్వేషన్లు పెంచుతామని ఇటీవలే ఆదివాసి, బంజారా సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుతూ 2016లోనే బిల్లును ప్రవేశపెట్టింది. దీంతో ఉభయ సభలు ఆమోదం తెలిపాయని ప్రభుత్వం పేర్కొంది. రిజర్వేషన్ల పెంపుపై పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపింది. ఎస్టీలు నష్టపోకుండా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం పేర్కొంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని