పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో మా అభ్యంతరాలు పట్టించుకోవట్లేదు: తెలంగాణ
పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తమ అభ్యంతరాలు, వినతులను పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది.
హైదరాబాద్: పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తమ అభ్యంతరాలు, వినతులను పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల సంఘానికి (Central Water Commission) లేఖ రాసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్.. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా రాష్ట్రంలోని 954 ఎకరాలు ముంపునకు గురవుతాయన్నారు. ఇతర ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని గతంలో పలుమార్లు పేర్కొన్నట్లు తెలిపారు.
తాము లేవనెత్తిన తొమ్మిది అంశాల్లో ఒక్కదానిపై చర్య తీసుకోలేదని తెలిపారు. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, పీపీఏ నుంచి సమన్వయ లోపం ఉందని లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించినట్లు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీడబ్ల్యూసీ, పీపీఏ సమావేశాల్లో ఇచ్చిన హామీలు కంటితుడుపుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. తక్షణమే తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nagarjuna sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్దకు చేరుకొని ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేశారు. డ్యామ్‌పై విద్యుత్ సరఫరా నిలిపివేసి, అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. -
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్త పోర్టల్‌ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/11/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
-
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
-
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
-
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
-
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
-
యువకుణ్ని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకుమారులు